ధరలు ఆగేట్లు లేవే
దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అందనంత దూరంలో పరుగులు తీస్తున్నాయి
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు మాత్రమే తగ్గుతుంటాయి. ఈ ఏడాది తులం బంగారం డెబ్బయి వేల రూపాయలకు చేరుకుంటుందన్న నిపుణుల అంచనా నిజమయ్యేటట్లుంది. వారంలో రెండు రోజులు స్వల్పంగా ధరలు తగ్గితే ఐదు రోజులు ధరలు పెరుగుతూనే ఉంటాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింతగా పరుగులు తీస్తాయంటున్నారు. దీంతో బంగారం పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారనుంది.
భారీగా పెరగడంతో...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అందనంత దూరంలో పరుగులు తీస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 550 రూపాయలు పెరిగింది. కిలో వెండివ ధరపై 1,600 రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,650 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,800 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర 83,000 రూపాయలకు చేరుకుంది.