బ్యాడ్‌న్యూస్ : బంగారం మరింత భారంగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.150లు పెరిగింది. వెండి మాత్రం తగ్గింది

Update: 2023-02-10 03:23 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలకు కళ్లెం పడటం లేదు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ఇక తగ్గే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఈ ఏడాది తులం బంగారం డెబ్బయి వేల రూపాయలు దాటినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అయినా భారతీయ సంస్కృతిలో బంగారం ఒక భాగమై పోవడంతో కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు.

వెండి మాత్రం...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.150లు పెరిగింది. వెండి మాత్రం తగ్గింది. కిలో వెండి ధరపై ఐదు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,900 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,710 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ఐదు వందల రూపాయలు తగ్ి 73,500 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News