పరుగులు తీస్తున బంగారం.. ఎంతంటే?
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి
బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయో? ఎందుకు తగ్గుతాయో? స్పష్టంగా కారణాలు చెప్పలేం. డిమాండ్ - సప్లయ్ ను బట్టి ధరలు పెరుగుతుంటాయి. కానీ బంగారానికి ఈ సూత్రం మాత్రం వర్తించదు. ఎందుకంటే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అలాగే పసిడిని ప్రేమించని వారు ఎవరు ఉండరు. పసిడి అంటే పడి చచ్చే వారు అనేక మంది భారత్ లో కోకొల్లలు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకం విలువ వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు కనపడుతుంటాయి.
వెండి మాత్రం...
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,360 రూపాయలుగా పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,000 రూపాయలుకు చేరుకుంది. కిలో వెండి ధర 68,500 రూపాయలుగా ఉంది. ఈ ధరలు నగరాలను బట్టి స్వల్పంగా మార్పు ఉంటుంది.