ఫుల్లు హ్యాపీ... గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి

Update: 2023-02-27 03:22 GMT

బంగారం అంటే భారతీయులకు మహా ప్రీతి. తమ వద్ద ఏమాత్రం డబ్బులున్నా బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. బంగారం కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా చూస్తుండటంతో బంగారానికి డిమాండ్ ఏనాడు తగ్గలేదు. అయితే కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, కేంద్ర బడ్జెట్ లో బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం, బంగారం దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా అంచనా వేశారు.

స్థిరంగా ధరలు...
అయితే మార్కెట్ నిపుణుల అంచనాలకు భిన్నంగా బంగారం ధరలు వరసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,500 రూపాయల వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,180 రూపాయలకు చేరుకుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 70,000 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News