ఊరట కాక మరేమిటి?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి.

Update: 2023-03-31 04:00 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. తగ్గితేనే ఆనందం. పెరిగితే బాధ. పెరగుకున్నా, తగ్గకున్నా స్థిరంగా కొనసాగినా సంతోషమే. అయితే వారంలో కేవలం ఒక్క రోజు మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎక్కువ సార్లు బంగారం ధరులు పెరుగుతూనే ఉంటాయి. బంగారం ధరలు అసలు పెరగడానికి కారణాలేంటన్న దానిపై ఒక్కో నిపుణులు ఒక్కోరకమైన విశ్లేషణ ఇస్తారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, కేంద్ర బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం వంటి కారణాలతో పసిడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం పది గ్రాముల బంగారం ధర మరికొద్ది కాలంలోనే డెబ్భయివేల రూపాయలకు చేరుకుంటుందని అంచనాలు వినపడుతున్నాయి.

పెరిగిన వెండి...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండిపై ఐదు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,700 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,670 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 76,200 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News