గుడ్ న్యూస్.. గోల్డ్ ధర పెరగలేదు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి

Update: 2022-08-22 02:11 GMT

బంగారానికి ఎప్పుడైనా దానికి విలువ తగ్గదు. చెదరని వస్తువుగా దానిని భావిస్తారు. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారానికి పేదల నుంచి ధనవంతుల వరకూ ఒకే విలువ. దానికి ఉన్న డిమాండ్ ను బట్టి ధరలను పెరుగుతుంటాయి. శ్రావణమాసం పూర్తి కానుండటం, పెళ్లి ముహూర్తాలు కూడా ఇక డిసెంబరు వరకూ లేకపోవడంతో కొనుగోళ్లు కొంత తగ్గుతాయని అందరూ భావిస్తున్నా, సీజన్ లేకుండా కొనుగోలు చేసేది ఒక్క బంగారమే అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడం భారతీయ మహిళలకు అలవాటుగా మారిపోయింది. అందుకే దానికి డిమాండ్ రోజురోజుకూ రోజుకూ పెరుగుతుంది.

వెండి ధర స్వల్పంగా...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఇది ఒకరకంగా బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్తేనని చెప్పాలి. సోమవారం ఉదయం దేశీయ మార్కెట్లో పసిడి ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.47,800 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,150 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,800 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో కు రూ.100లు పెరగడంతో హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 61,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News