నింగినంటిన పసిడి ధరలు

దేశంలో ఈరోజు బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగింది. వెండి మాత్రం భారీగా పెరిగింది.

Update: 2023-05-09 04:06 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. భారతీయ సంస్కృతిలో బంగారం ఒక భాగం కావడంతో భారమైనా కొనుగోలు చేయక తప్పని పరిస్థిితి. మధ్య తరగతి ప్రజల నుంచి ధనవంతుల వరకూ బంగారాన్ని ఒక స్టేటస్ సింబల్‌గా భావించడంతో కొనుగోళ్ల మీద అందరూ దృష్టి పెడుతుంటారు. పెళ్లిళ్లు, కుటుంబంలో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు తప్పని సరి అయింది. అయితే బంగారం ధరలు పెరుగుతాయని తెలిసినా కేర్ చేయడం లేదు. జ్యుయలరీ దుకాణాల్లో కొత్త కొత్త డిజైన్లు రావడం ఆలస్యం.. అప్పు చేసైనా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇక నెలవారీ స్కీంలు ప్రవేశపెట్టిన జ్యుయలరీ షాపులు యాజమాన్యం టెక్నిక్‌తో కొనుగోలు దారులను ఆకట్టుకుంటున్నాయి.

భారీగా వెండి...
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలు దారులు ఊరట చెందారు. అయితే తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగింది. వెండి మాత్రం భారీగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై 120 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై నాలుగు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,600 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,750 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 82,700 రూపాయలకు చేరుకుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News