రైతుల ఆందోళనకు నేటితో తెర.. మోదీ లేఖతో?
గత ఏడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనకు నేడు తెరపడనుంది.
గత ఏడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనకు నేడు తెరపడనుంది. స్వయంగా మోదీ రైతు సంఘ నేత రాకేష్ టికాయత్ కు లేఖ రాయడంతో దీనిపై చర్చించేందుకు నేడు రైతు సంఘాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆందోళనలను విరమించేందుకే రైతు సంఘాలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
మూడు చట్టాలు..
గత ఏడాదికి పైగానే మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. దాదాపు ఏడు వందలకు పైగా రైతులు మరణించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంది. ఉభయ సభల్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే కనీస మద్దతు ధరను ప్రకటించాలని రైతులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ నేపథ్యంలో మోదీ లేఖ రాయడంతో ఆందోళన విరమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.