సండే.. గోల్డ్ డే

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.500లు తగ్గింది. కిలో వెండిపై కూడా రూ.500 తగ్గింది

Update: 2022-09-25 02:25 GMT

బంగారం కొనుగోలు చేయడం అంటే అంత ఆషామాషీ కాదు. ఈ మాటలు ఇప్పుడు కాదు. పాత జమానాలో. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడం సులువుగా మారింది. పేద, మధ్యతరగతి ప్రజలకు కూడా బంగారాన్ని అందుబాటులోకి తెచ్చారు దుకాణదారులు. తమ వ్యాపారం కోసం కావచ్చు. బంగారానికి ఉన్న డిమాండ్ రీత్యా కావచ్చు. వివిధ స్కీమ్ లతో మన ఇంటి ముంగిటకే అనేక బంగారం దుకాణాలు వస్తున్నాయి. ఇక భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారం దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహిళలు ఇష్టపడే ఈ బంగారాన్ని తమ ఇంట్లోకి తీసుకెళ్లేంత వరకూ ప్రకటనల రూపంలో ముంగిట్లోకి వస్తున్నాయి. ఇక బంగారం ధరలు పెరగడానికి, తగ్గడానికి అనేక కారణాలున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు పెరుగుతుంటాయి. తగ్గుతుంటాయని మార్కెట్ నిపుణలులు చెబుతున్నారు.

ధరలు ఇలా....
తాజాగా ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.500లు తగ్గింది. కిలో వెండిపై కూడా రూ.500 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,200 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,000లకు చేరుకుంది. ఇక కిలో వెండి హైదరాబాద్ లో 61,500 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News