పరుగులు పెడుతున్న పసిడి
ఈరోజు బంగారం,వెండి ధరలు దేశంలో భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.600లు పెరిగింది. కిలో వెండిపై రూ.1400 పెరిగింది
బంగారం ధరలు ఆకాశంలోకి చూస్తున్నాయి. ఎవరూ కొనలేనంత రీతికి చేరుకుంటున్నాయి. బడ్జెట్ తర్వాత వరసగా రెండో రోజు కూడా ధరలు పెరిగాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నప్పటికీ వేటితో సంబంధం లేకుండానే ధరలు పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఇక పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందకుండా పోతున్నాయి. ధనికవర్గానికే బంగారం దక్కుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కొన్ని రోజులుకు అపురూపమైన వస్తువుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బంగారం దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం, బంగారం, వెండి పై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో ధరలు మరింత పెరుగుతున్నాయి. ఇవి అందనంత దూరంగా వెళతాయని భావిస్తున్నారు.