హమ్మయ్య.. పసిడి ధరలకు బ్రేక్ పడింది
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.600లు తగ్గింది. కిలో వెండిపై రూ.400లు తగ్గింది.
బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. అంతర్జాతీయ మార్కెట్ ను బట్టి వాటి ధరలు ఆధారపడి ఉంటాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ధరలతో సంబంధం లేకుండానే కొనుగోళ్లు జరుగుతుండటంతో ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కాకుంటే భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారాన్ని కొనుగోలు చేయాలంటే పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది. ఇప్పటికే ఎవరూ ఊహించినంత ధరకు బంగారం చేరిపోయింది. ఈ ఏడాదిలో తులం బంగారం ఎనభై వేలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటారు మార్కెట్ నిపుణులు. కొనుగోలు శక్తి కూడా తగ్గిపోవడంతో బంగారం అంటేనే పేద, మధ్య తరగతి ప్రజలు భయపడిపోతున్నారు. బంగారం, వెండి వస్తువులు కొన్ని వర్గాలకు దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది.