అ"ధర" హో బంగారం

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.500లు పెరిగింది

Update: 2022-12-22 04:07 GMT

తగ్గిందని సంతోషపడేలోగా పెరగడం ఎంతసేపు. బంగారం విషయంలో ఇదే జరుగుతుంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గాయని కొనుగోలుదారులు సంబరపడిపోతుంటే ఆ ముచ్చట మూణ్ణాళ్లు కూడా లేదు. పసిడి అంటే భారతీయ పడతులు ప్రాణమిస్తారు. దాచుకున్న సొమ్ముతో ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయాలని కోరుకుంటారు. అందుకే బంగారానికి డిమాండ్ ఎప్పుుడూ తగ్గదు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సీజన్ తోనూ, ధరలతోనూ సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటంతో బంగారం ధరలు ఆకాశానికి అంటుతున్నాయన్న వారు కూడా లేకపోలేదు. ఒకప్పుడు అలంకార వస్తువుగా ఉన్న బంగారం నేడు అవసరమైన వస్తువుగా మారడంతో బంగారానికి డిమాండ్ బాగా పెరిందన్నది మార్కెట్ నిపుణుల మాట.

వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.500లు పెరిగింది. కిలో వెండి పై రూ.800లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,650 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,110 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 74,700 రూపాయలకు చేరుకోవడం విశేషం.


Tags:    

Similar News