బంగారం కొనుగోలు చేయాలంటే?
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.400లు పెరిగింది. కిలో వెండిపై రూ.1000 లు పెరిగింది
బంగారం ఒకరోజు తగ్గిందంటే మరుసటి ఖచ్చితంగా పెరగాల్సిందే. తగ్గితే తక్కువగా పెరిగితే భారీగా పెరగడం బంగారం విషయంలోనే చూస్తుంటాం. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. పెళ్లిళ్ల సీజన్ లోనే అనుకుంటే పొరపాటు. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుగోలు చేసి దగ్గర పెట్టుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. కరోనా వంటి కష్ట సమయంలో బంగారం మధ్య తరగతి ప్రజలకు బాగా ఉపయోగపడిందంటారు. అందుకోసమే బంగారాన్ని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడిగా చూస్తున్నారు. దీంతో కొనుగోళ్లు ఏమాత్రం తగ్గడం లేదు.
కిలో వెండి పై...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.400లు పెరిగింది. కిలో వెండిపై రూ.1000 లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 53,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,930 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 75,000 రూపాయలకు చేరుకుంది.