పసిడి అంతే....ఈరోజు ధర ఎంతంటే?

ఈరోజు దేశంలో పది గ్రాముల బంగారం పై 440 రూపాయలు, వెండి పై కిలో 600 రూపాయల వరకూ తగ్గింది.

Update: 2022-09-17 02:49 GMT

బంగారం ధరలు ఎప్పుడూ ప్రియమే. ధరలు ఎప్పుడు తగ్గుతాయో, పెరుగుతాయో చెప్పలేం. ధర తగ్గాలనుకునప్పుడే కొనుగోలు చేద్దామని అనుకునే రోజులు కావివి. ఎందుకంటే ధరలతో, సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేస్తుండటంతో పాత సంప్రదాయానికి తెరపడినట్లే. అందుకే బంగారం షాపులు ఎప్పుడూ కిటకిట లాడుతుంటాయి. ధరలు పెరిగినా డోన్ట్ కేర్ అనడం పరిపాటిగా మారిపోయింది. ఇక డాలర్ విలువలో రూపాయి తగ్గడం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు బంగారం ధరల్లో మార్పునకు కారణంగా చెబుతుంటారు. మరో రెండు నెలల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశముంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ధరలు ఇలా...
దేశంలో ఈరోజు దేశంలో పది గ్రాముల బంగారం పై 440 రూపాయలు, వెండి పై కిలో 600 రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,960 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,800 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి 61,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News