గుడ్ న్యూస్.. పుత్తడి ధర పడిపోయింది

ఈరోజు దేశంలో బంగారం ధర బాగా తగ్గింది. పది గ్రాముల బంగారంపై రు.660లు తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది

Update: 2022-11-05 02:02 GMT

బంగారం ధరల్లో అనేక కారణాలతో హెచ్చు తగ్గులుంటాయి. ఒకసారి భారీగా తగ్గితే, మరోసారి భారీగా పెరిగిపోతుంది. బంగారం మాత్రం ఎక్కువగా భారీగా పెరగడం, స్వల్పంగా తగ్గడం మనం చూస్తుంటాం. కానీ గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇది పసిడిని తమ సొంతం చేసుకునే వారికి శుభవార్త. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, యుద్ధాలు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పలు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతుంటారు. అయినా ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేసే రోజులివి. అందుకే పెద్దగా ధర పెరిగినా, తగ్గినా కొనుగోలు చేసేవారు పట్టించుకోరన్నది వ్యాపారులు చెబుతున్న మాట. వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

పెరిగిన వెండి ధర....
ఈరోజు దేశంలో బంగారం ధర బాగా తగ్గింది. పది గ్రాముల బంగారంపై రు.660లు తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండిపై రూ.1900లు పెరిగింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,290 రూపాయలు కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,100 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 64,400 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News