వావ్... హ్యాపీ న్యూస్

ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది

Update: 2023-05-08 04:22 GMT

బంగారం ధరలు తగ్గుతుండటం కొంత ఊరట కల్గించే అంశమే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు తగ్గితే అనేక మంది బంగారం కొనుగోలు చేయడానికి వీలవుతుంది. బంగారం ధర ఇటీవల కాలంలో దూసుకు వెళుతుంది. ధరలు పెరుగుతాయన్న అంచనాను మార్కెట్ నిపుణులు ముందుగానే అంచనా వేశారు. ఈ ఏడాది డెబ్భయి వేలకు తులం బంగారం చేరుకుంటుందని అంచనా వేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలు భయపడి పోయారు. అయితే కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతాయని చెప్పారు.

వెండి కూడా...
కానీ గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది తులాల బంగారం ధరపై పది రూపాయల వరకూ తగ్గింది. వెండి ధర కూడా స్వల్పంగానే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,490 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,630 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 82,400 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News