దిగివచ్చిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం పై రూ.150లు తగ్గింది. కిలో వెండిపై రూ.300లు తగ్గింది
బంగారం ధరలు గత మూడు రోజుల నుంచి కొంత దిగి వస్తున్నాయి. అది స్వల్పంగానే. స్వల్పంగా బంగారం ధరలు దిగడం భారీగా పెరిగేందుకు ఒక సంకేతంగా భావించాలంటారు మార్కెట్ నిపుణులు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. కానీ ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు సాగుతుండటం కూడా విశేషంగానే చెప్పుకోవాలి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో జ్యుయలరీ దుకాణాలన్నీ కిటికిట లాడిపోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ రావడంతో మార్కెట్ లోకి కొత్త కొత్త డిజైన్లతో ఆభరణాలను వినియోగదారులను ఆకట్టుకునేలా దుకాణదారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బంగారానికి ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు.
వెండి కూడా...
ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం పై రూ.150లు తగ్గింది. కిలో వెండిపై రూ.300లు తగ్గింది. గత మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరట కల్గించే అంశమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,020 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,600 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర ప్రస్తుతం 65,500 రూపాయలకు చేరుకుంది.