పసిడి ప్రేమికులకు షాకింగ్
ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధర స్వల్పంగా తగ్గింది. వరసగా మూడోరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి.
బంగారం అంటే అందరికీ మోజు. ముఖ్యంగా భారతీయులు అత్యంత ఇష్టపడే వస్తువు బంగారంగానే చెప్పుకోవాలి. దానిని ఒక గౌరవంగా చూస్తారు. ఒకప్పుుడ దానిని ఖరీదైన వస్తువుగా చూసినా ఈరోజుల్లో మాత్రం తమ అవసరాలకు భవిష్యత్ లో ఉపయోగపడే వస్తువుగానూ, సంప్రదాయంగా తమ కుటుంబంలో వస్తువుగా చూస్తున్నారు. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్ ఏర్పడింది. మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈ నెలాఖరుకు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
స్వల్పంగా తగ్గిన వెండి...
ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధర స్వల్పంగా తగ్గింది. వరసగా మూడోరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. స్వల్పంగా పెరిగినా ఇప్పుడు కొనుగోలు చేయడం మేలని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,200 రూపాయలు గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,850 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 500లు తగ్గి 66,500 రూపాయలకు చేరుకుంది.