స్వల్పంగా పెరిగిన బంగారం ధర

దేశంలో ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది

Update: 2022-08-09 01:05 GMT

gold silver rates in hyderabad

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు మామూలే. ధరల ప్రభావం కొనుగోళ్ళపై పెద్దగా ఉండకపోవడంతో వ్యాపారులు కూడా బంగారం ధరలను పెద్దగా పట్టించుకోరు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు వంటి కారణాల వల్ల బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు వస్తుంటాయి. శ్రావణమాసం కావడం, పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు మామూలే లని కొనుగోలు దారులు సయితం సరిపెట్టుకుంటారు.

వెండి ధర స్థిరంగా....
దేశంలో ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం 51,870 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,550 రూపాయలుగా ఉంది. వెండి మాత్రం కిలో 63,000 రూపాయల వద్దనే కొనసాగుతుంది.


Tags:    

Similar News