వావ్.. బంగారం ధరలు తగ్గాయ్

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర పై రూ.150లు తగ్గింది. కిలో వెండిపై రూ.200లు తగ్గింది.

Update: 2023-02-01 03:17 GMT

బంగారం అంటే ఇష్పపడని వారు ఎవరూ ఉండరు. కొంత ఖరీదయినా బంగారం తమ వద్ద ఉండాలని కోరుకునే వారిలో భారతీయులు ఎక్కువగా కనిపిస్తారు. ఆభరణాల రూపంలోనే ఎక్కువగా భారతీయులు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. గోల్డ్ బాండ్స్ ను పెద్దగా పట్టించుకోరు. ఇతర దేశాల్లో మాత్రం గోల్డ్ బాండ్స్ విక్రయాలు జోరుగా సాగుతాయి. రూపాయి విలువ పతనం అవుతుండటంతో బంగారం దిగుమతులను కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో డిమాండ్ కు తగినట్లు సప్లయ్ లేకపోవడంతో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం ఈ ఏడాది మరింత ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా బంగారం కొనుగోళ్లు జరుగుతున్నాయి.

వెండి కూడా...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర పై రూ.150లు తగ్గింది. కిలో వెండిపై రూ.200లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,500 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,270 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 74,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News