నేడు త్రిసభ్య కమిటీ సమావేశం.. ఐదు అంశాలపైనే?

రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమన్యలపై నేడు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది.

Update: 2022-02-17 02:09 GMT

రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమన్యలపై నేడు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలసిందే. ఈరోజు కమిటీ వర్చువల్ గా సమావేశమై చర్చిస్తుంది. ఈ సమావేశంలో మొత్తం ఐదు అంశాలపై చర్చించాలని అజెండాలో ఖరారు చేశారు.

ఈ అంశాలు....
ఏపీ ఆర్థిక సంస్థ విభజన, ఆంధ్రప్రదేశ్ జెన్ కోకు,, తెలంగాణ డిస్కంలకు సంబంధించి రావాల్సిన బకాయీలు, పన్నుల్లో వ్యత్యాసాలు, బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలు, డిపాజిట్ల పంపిణీ పై నేడు చర్చించనున్నారు. హోంశాఖ సహాయ కార్యదర్శితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చీఫ్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.


Tags:    

Similar News