24 గంటలూ ఎంచక్కా షాపింగ్ చేసుకోవచ్చు.. షాపులన్నీ తెరిచే ఉంచేలా ఉత్తర్వులు
దేశంలోని వ్యాపారంలో పోటీతత్వం పెరుగుతున్న వేళ ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
దేశంలోని వ్యాపారంలో పోటీతత్వం పెరుగుతున్న వేళ ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేబర్ రూల్స్ ప్రకారం దుకాణాలు నిర్దేశిత సమయానికి మూసివేయాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆధుని సమాజంలో షాపింగ్ అనేది ఒక ఫ్యాషన్ గా మారింది. కొత్త ట్రెండ్ గా మారింది. అందుకే ప్రభుత్వాలు కూడా తన నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ప్రజలు తమకు వీలయిన వేళల్లో షాపింగ్ చేసుకునేందుకు వీలుగా దుకాణాలను ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇస్తున్నాయి.
అదనపు మొత్తం చెల్లించి...
తాజాగా చండీగఢ్ ప్రభుత్వం కూడా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే షరతులు వర్తిస్తాయని తెలిపింది. కానీ వైన్ షాపులు, బార్లు మాత్రం ఎక్సైజ్ నిబంధనల మేరకు తెరిచి ఉంచాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మిగిలిన దుకాణాలు 24 గంటలూ తెరిచి ఉంచవచ్చని, అయితే అందుకు ప్రభుత్వానికి కొంత మొత్తాన్ని అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదనపు మొత్తం చెల్లించి అనుమతి పొందితే చండీగఢ్ లో ఇరవై నాలుగు గంటలూ దుకాణాలు తెరిచి ఉంచేందుకు వీలవుతుంది. ఇది ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి మంచి స్పందన వస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.