మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? తగ్గుతాయో చెప్పలేని పరిస్థితి. ధరల మార్పునకు అనేక కారణాలు కనిపిస్తాయి.

Update: 2022-10-28 02:50 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? తగ్గుతాయో చెప్పలేని పరిస్థితి. ధరల మార్పునకు అనేక కారణాలు కనిపిస్తాయి. బంగారాన్ని ఇష్టపడే వారు ఎవరుండరు? అందరూ ఇష్టపడతారు. కానీ ధరలను చూసి కొనుగోలు చేసేవాళ్లు కొందరైతే. పండగలకు, ఫంక్షన్లకు కొనుగోలు చేసే వారు మరికొందరు. ఇంకొందరు పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తుంటారు. కొందరు ఎప్పటికప్పుడు లభించే కొత్త డిజైన్లను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో కొనుగోలు చేస్తుంటారు. వీరి సంఖ్య తక్కువగానే ఉంటుంది. అయినా బంగారానికి భారత్ లో ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. దాని వన్నె మాదిరిగానే మెరిసిపోతుంటుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చేటు చేసుకుంటాయని నిపుణులు చెబుతుంటారు. ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్ లో ఇబ్బడి ముబ్బడిగా దుకాణాలు వస్తున్నాయి.

వెండి కూడా...
తాజాగా ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి కూడా పెరిగింది. పది గ్రాముల బంగారం పై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,280 రూపాయలు కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,100 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర ప్రస్తుతం 63,500 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News