స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి ధర
దేశంలో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి
బంగారం ధరలు నిత్యం మారుతూ ఉంటాయి. తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. దీనీకి అనేక కారణాలు చెబుతుంటారు మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం వంటి కారణాలు బంగారం ధరల్లో హెచ్చు తగ్గుదలకు కారణంగా చెబుతుంటారు. ఇక భారతీయ మార్కెట్ లో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎక్కువ మంది భారతీయ మహిళలు మక్కువ చూపేది బంగారం కావడంతో దానికి అంత డిమాండ్ ఉంది. బంగారం తమ వద్ద ఎంత ఉంటే అంత గౌరవంగా భావించే రోజులివి. దీంతో పాటు పెట్టుబడిగా చూసేవారు కూడా ఎక్కువవ్వడంతో బంగారానికి భారతీయ మార్కెట్ లో అధిక డిమాండ్ ఏర్పడింది.
హైదరాబాద్ మార్కెట్ లో....
దేశంలో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,650 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,350 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 64,200 రూపాయలుగా ఉంది.