బంగారం ధరలు దిగొచ్చాయ్

బంగారం, వెండి అంటే ఎవరికి ఇష్టముండదు. పేద నుంచి ధనిక వరకూ గోల్డ్, సిల్వర్ అంటే మహా ప్రీతి

Update: 2022-10-12 02:39 GMT

gold and silver prices

బంగారం, వెండి అంటే ఎవరికి ఇష్టముండదు. పేద నుంచి ధనిక వరకూ గోల్డ్, సిల్వర్ అంటే మహా ప్రీతి. అప్పు చేసి బంగారం కొనుగోలు చేసేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు జ్యుయలరీ షాపులే వాయిదా పద్ధతుల్లో బంగారం కొనుగోలుకు అవకాశమిస్తుండటంతో ఇక ఎవరూ తగ్గడం లేదు. నెలకు ఇంత మొత్తం పొదుపు చేసుకుంటూ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అదే కష్టకాలంలో తమను ఆదుకుంటుందని భావిస్తున్నారు. కరోనా అనేక మందిని కష్ట సమయంలో ఆదుకుంది బంగారమే. బంగారం అయితే తక్కువ వడ్డీకి కుదువ పెట్టి ఎక్కువ మొత్తాన్ని తీసుకునే వీలుండటమూ బంగారానికి డిమాండ్ పెరగడానికి కారణంగా చెప్పాలి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయి. తగ్గుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

రెండో రోజూ...
తాజాగా దేశంలో రెండో రోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,160 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,900 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధరపై రూ.800లు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 64,000 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News