Maharashtra : నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది నేడు తేలనుంది. నేడు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష సమావేశం కానుంది.

Update: 2024-12-04 01:50 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది నేడు తేలనుంది. నేడు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష సమావేశం కానుంది. ఈ సమావేశానికి పరిశీలకులిగా బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీలను నియమించింది. వీరిద్దరి సమక్షంలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపిక జరగనుంది. ఈరోజు ఎంపికయ్యే వారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణించాల్సి ఉంటుంది.

నేడు జరిగే శాసనసభపక్ష సమావేశంలో...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలవడంతో ముఖ్యమంత్రి పదవి తామే తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏక్ నాధ్ షిండే, అజిత్ పవార్ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే అవకాశముంది. రేపు ముంబయి ఆజాద్ మైదానంలో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో, అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు కూడా హాజరు కానున్నారు.


Tags:    

Similar News