గుజరాత్ లో ఎక్స్ఈ, ఎక్స్ఎం కేసులు గుర్తింపు

తాజాగా గుజరాత్ లో ఎక్స్ఈ కేసు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వేరియంట్ల కంటే 10 శాతం వేగంగా విస్తరించే గుణం ఎక్స్ఈ

Update: 2022-04-09 06:09 GMT

వడోదర : కరోనా కొత్తరకం ఎక్స్ఈ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించి, ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది. రెండురోజుల క్రితం మహారాష్ట్రలోని ముంబైలో కరోనా ఎక్స్ఈ కేసును గుర్తించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. అది ఎక్స్ఈ కేసు కాదని, తొందరపడి ప్రకటన చేశారంటూ కేంద్రం ఖండించింది. ఆ శాంపిల్ ను మరోసారి జీనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని ఆదేశించారు.

తాజాగా గుజరాత్ లో ఎక్స్ఈ కేసు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వేరియంట్ల కంటే 10 శాతం వేగంగా విస్తరించే గుణం 
ఎక్స్ఈ
 వేరియంట్ కు ఉందని ఇప్పటికే ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. మార్చి 13న వడోదర పట్టణానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి ఎక్స్ఈ ఉన్నట్టు గుర్తించగా, రోగి వారం రోజుల్లో కోలుకున్నట్టు వైద్య అధికారులు తెలిపారు. జీనోమిక్ సీక్వెన్సింగ్ లో ఎక్స్ఈ వేరియంట్ గా తేలడంతో మరోసారి నిర్ధారించుకునేందుకు శాంపిల్ ను పంపించినట్టు చెప్పారు. కరోనాలో మరో రకమైన ఎక్స్ఎం కేసులు గుజరాత్, మహారాష్ట్రలలో ఒక్కొక్కటి వెలుగుచూశాయి.



Tags:    

Similar News