ఏపీకి బాబు గుడ్ బై ...?

Update: 2018-12-03 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ను కుమారుడు లోకేష్ కి మంత్రులకు అప్పగించి తెలంగాణ పై సీరియస్ గా దృష్టి సారించారు తెలుగు దేశం అధినేత చంద్రబాబు. ఈనెల ఐదో తేదీతో ప్రచారం ముగుస్తుండటంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తృత ప్రచారానికి బాబు టూర్ ఖరారు అయ్యింది. క్షణం తీరిక లేకుండా రోడ్ షో లు సభలు, సమావేశాలతో టిడిపి హీటెక్కిస్తుంది ఇప్పటికే. తాజాగా బాబు వరుస టూర్లతో మూడు రోజుల పాటు ఎపి రాజకీయాలకు ఆయన దూరం అవుతున్నారు. ఇప్పుడు వైసిపి, జనసేన, బిజెపి లపై మంత్రులు ఎమ్యెల్యేలు మాత్రం తిట్ల దండకం యధావిధిగా కొనసాగిస్తున్నారు.

తెలుగు జాతి నినాదం ...?

తెలుగు జాతి అంతా రెండు రాష్ట్రాలుగా ఉన్నా ఒక్కటై అభివృద్ధి చెందాలనే స్లోగన్ తో దూసుకువెళుతున్నారు ఎపి సిఎం. 2014 లో తెలంగాణ లో ఓటమి, ఓటుకు నోటు కేసు తరువాత తనకు ఎపి అభివృద్ధే ప్రధానమని ఇక్కడి ప్రజలకు చెప్పుకొచ్చారు చంద్రబాబు. తాజాగా జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో పొత్తులతో పోటీకి దిగిన బాబు తన గత వ్యాఖ్యల్లో మార్పుతెచ్చారు. ఎపి, తెలంగాణ రెండు కళ్ళు హైదరాబాద్ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని, అమరావతి హైదరాబాద్ ఒకేలా తీర్చి దిద్దుతామని అంటున్నారు చంద్రబాబు. ఈ ప్రచారం టిడిపి కి ఈ ఎన్నికల్లో ఎంత వరకు కలిసి వస్తుందన్న అంచనాలపై రాజకీయ విశ్లేషకుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. బాబును నమ్ముకుని ఆయన అనుభవాన్ని గుర్తించి పాలన పగ్గాలు అప్పగిస్తే ఆయన పక్క రాష్ట్రం అభివృద్ధిపై ఆలోచనలు చేయడాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏపీలో అన్నది ఆసక్తికరం.

జగన్, పవన్ లకు కలిసొచ్చే అంశమే ...

కలిసి ఉందామన్నా విడిపోదామని పోరాడి విభజన చేసుకున్న వారి వెంట పడటం పై ఏపీలో మిశ్రమ స్పందన లభిస్తుంది. ఇప్పటికే వైసిపి తెలంగాణ లో రాజకీయాలకు తెరదించి స్కూల్ మూసేసింది. అదే రూట్ లో జనసేన సైతం సాగిపోతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో చేస్తున్న ప్రసంగాలు ఏపీలో ఆయనకు రివర్స్ కొట్టనున్నాయి. ఇప్పటికే బాబు తెలంగాణా పై ప్రేమ కురిపిస్తూ చేస్తున్న వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో సెటైర్లు పడుతున్నాయి. అదే రీతిలో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ బాబు కు తెలంగాణ ఎఫెక్ట్ గట్టిగా పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎపి రాజకీయాల్లో కాంగ్రెస్ తప్ప ప్రస్తుతం చంద్రబాబు పై విపక్షాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. తాజాగా టీఆర్ఎస్ కూడా ఎపి లో వేలు పెడతామని ఇప్పటికే తేల్చేసింది. తెలంగాణ లో టిడిపి రాజకీయాలు చేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయకూడదన్నది ఆ పార్టీ భావన. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బాబు కొత్త శత్రువును కూడా పాత వారితో కలిపి ఎదుర్కోవాలి. చూడాలి ఆ సీన్ ఎలా వుండబోతుందో...?

Similar News