పెద్దిరెడ్డి అంటే అంత వణుకా ?

చిత్తూరు జిల్లా రాజకీయాలు తెలిసిన వారికి చంద్రబాబు బడాయి గురించి కూడా బాగా తెలుస్తుంది అంటారు. ఆ జిల్లాకు చెందిన చంద్రబాబుకి తాను పుట్టిన రాయల‌సీమ కంటే [more]

Update: 2021-02-18 06:30 GMT

చిత్తూరు జిల్లా రాజకీయాలు తెలిసిన వారికి చంద్రబాబు బడాయి గురించి కూడా బాగా తెలుస్తుంది అంటారు. ఆ జిల్లాకు చెందిన చంద్రబాబుకి తాను పుట్టిన రాయల‌సీమ కంటే కోస్తా జిల్లాలతోనే బంధమెక్కువ అని విమర్శలు ఉన్నాయి. ఇక చంద్రబాబుకు అండ దండలు అన్నీ కూడా కోస్తా నడిబొడ్డున ఉన్న రెండు జిల్లాల‌ నుంచే దక్కుతాయని చెబుతారు. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబుకు రాను రానూ సొంత జిల్లాలో ప్రభ మసకబారుతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో తాను చాలా కష్టపడి గెలిచి మిగిలిన సీట్లు అన్నీ వైసీపీకి అప్పగించిన నాడే బాబు టీడీపీ బోల్తా కొట్టిందని అర్ధమైపోయింది.

ఆయనే ఎదురు మరి …

చిత్తూరు జిల్లాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ మోస్ట్ నేత. ఆయన వైఎస్సార్ జమానాలో మంత్రి పదవిని నిర్వహించినా జగన్ కోటరీలోనే ఉండేవారు. వైఎస్సార్, చంద్రబాబు మాదిరిగానే 1978 నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఆయన విపక్షంలో ఉన్నపుడే అతి బలాడ్యుడు. ఇక ఇపుడు చేతిలో అధికారం ఉంది. పైన సీఎం గా జగన్ ఉన్నారు. దాంతో చిత్తూరు టీడీపీని ఒక బంతాట ఆడించేస్తున్నారు. దాంతో చంద్రబాబుకు అసలైన ప్రత్యర్ధిగా ఎదురు నిలబడుతున్నారు.

కష్టమేనటగా….?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం మీద వైసీపీలో కూడా ఎన్నో రుసరుసలు ఉన్నా కూడా ఆయన్ని జగన్ వెనకేసుకురావడానికి అసలైన కారణం చంద్రబాబు. రాజకీయాల్లో పాత కాపు అయిన పెద్దిరెడ్డికి చంద్రబాబు పట్లూ గుట్లూ బాగా తెలుసు. అందుకే ఆయన్ని అడ్డుకోవడానికి చక్రబంధంలో బంధించడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని మించిన నేత మరొకరు లేరని జగన్ భావిస్తారు. మరి సీఎం జగన్ అండ చూసుకుని పెద్దిరెడ్డి చిత్తూరులో చెలరేగుతున్నారంటే అర్ధముందిగా. దానిని కౌంటర్ చేయడానికి బాబు వ్యూహాలు ఏ మాత్రం సరిపోవడంలేదు. అందుకే దొడ్డి దారిన ఆయన్ని నియంత్రించడానికి ఎత్తులు జిత్తులు వేస్తున్నారని అంటున్నారు.

కసి పెంచేశారా…?

అసలే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట, తీరూ రెండూ దూకుడుగానే ఉంటాయి. డెబ్బైలో పడినా కూడా ఈ రెడ్డిగారి జోరు ఎక్కడా ఇంకా తగ్గలేదు. ఇపుడు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆయన మీద చంద్రబాబు గురి పెట్టారు. కానీ తన పాచికలు పారలేదు. దానికి తోడు పెద్దిరెడ్డిలో కసి మరింతగా పెరిగిపోయింది. ఈసారి కుప్పం నుంచి బాబు ఎలా గెలుస్తాడో చూస్తాను అంటూ పెద్దిరెడ్డి పెద్ద శపధమే చేస్తున్నారు. మరి అదే కనుక జరిగితే టీడీపీకీ, బాబూకు 2024 చివరి ఎన్నికలు అవడం ఖాయమేగా.

Tags:    

Similar News