కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ఆగ్రహం లేదని బీజేపీ నాయకులు చెపుతున్నా ఎంతో కొంత ఆ ప్రభావం స్పష్టంగా అయితే కనపడింది. ఇటు చంద్రబాబు బీజేపీని ఓడించాలని తన దగ్గర ఉన్న ప్లాన్లు అన్నీ వేశాడు. ఇక్కడ నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని వెళ్లిన టీంను కూడా ఆయనే పంపాడన్నది ఓపెన్ సీక్రెట్. ఇక కేసీఆర్‌తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్లు జేడీఎస్‌కు మద్దతు ప్రకటించారు. వీరి ప్రభావం పనిచేసిందా ? లేదా తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చేస్తోన్న అన్యాయంపై వాళ్లు స్వతహాగా రగిలిపోయారా ? అన్నది తెలియదు కాని తెలుగు ఓటర్లు బలంగా ఉన్న జిల్లాల్లో బీజేపీకి దిమ్మతిరిగిపోయే ఫలితాలు వచ్చాయి.
సాయికుమార్ ఓటమి వెనక....
ఇక తెలుగువాళ్లకు బాగా తెలిసిన డైలాగ్ కింగ్‌స సాయికుమార్ తెలుగు వాళ్లు ఎక్కువుగా ఉన్న బాగేపల్లిలో డిపాజిట్లు కోల్పోయి ఘోరమైన అవమానం మిగుల్చుకున్నాడు. అక్కడ గత ఎన్నికల్లో నాలుగో ప్లేస్‌తో సరిపెట్టుకున్న ఆయన ఈ ఎన్నికల్లోనూ అదే ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డి విజయం సాధించారు. బాగేపల్లి అనంతపురం జిల్లాకు ఆనుకునే ఉంటుంది. ఇక్కడ తెలుగు వారే ఎక్కువ. అంటే తెలుగు వారే బీజేపీ నుంచి పోటీ చేసిన మన తెలుగు వాళ్లకు తెలసిన వాడు, హీరో సాయికుమార్‌ను ఎంత చిత్తుగా ఓడించారో అర్థమవుతోంది.
గాలి బ్రదర్స్ ఇలాకాలో.....
ఇక తెలుగు ఓటర్ల ప్రభావం గణనీయంగా ఉన్న జిల్లాల్లో బీజేపీ మట్టికరిచింది. అనంతపురం జిల్లాను ఆనుకుని ఉండి, మన తెలుగు వాళ్లు అయిన గాలి బ్రదర్స్ శాసించే బళ్లారి జిల్లాలో 9 సీట్లకు బీజేపీ 3 చోట్లే గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ 6 చోట్ల ఘనవిజయం సాధించింది. గాలి సోదరులు ఇద్దరూ మినహా ఇక్కడ గాలి అనుచరులు అందరూ ఓడారు. కంప్లీలో గత రెండుసార్లు గెలుస్తూ వస్తోన్న గాలి అనుచరుడు సురేష్‌బాబు సైతం ఓడిపోయారు.ఇక కర్నూలుకు ఆనుకుని ఉండే రాయచూర్ జిల్లాలో మొత్తం 9 సీట్లకు బీజేపీ 2 మాత్రమే గెలిచింది. తెలుగు వాళ్లే ఉండే కొప్పాల్ జిల్లాలో 5 సీట్లకు 2 గెలిచిన బీజేపీ, కోలార్, చిక్‌బళ్లాపూర్ జిల్లాల్లో అసలు ఖాతానే తెరవలేదు. కోలార్‌లో 6 సీట్లకు సున్నా, చిక్‌బళ్లాపూర్‌లో 6 సీట్లకు సున్నా సీట్లతో పరువు పోగొట్టుకుంది. ఈ రెండు జిల్లాల్లో ఉన్న 11 సీట్లలో బీజేపీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. ఇవన్నీ తెలుగు జనాలు ఉన్న బెల్ట్‌లే కావడం గమనార్హం. మరో విచిత్రం ఏంటంటే రాజధాని నగరమైన బెంగళూరులో బీజేపీకి వార్ వన్‌సైడ్‌గా ఉంటుందని అందరూ అనుకున్నారు. అక్కడ కూడా తెలుగు వాళ్లు ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 10కి పైగా సీట్లలో గెలిచింది. దీనిని బట్టి తెలుగు వాళ్లు కావాలని వేశారా ? లేదా బీజేపీ మీద కసితో వేశారో కాని అక్కడ ఆ పార్టీకి షాక్ తప్పలేదు.