ప్రస్తుతం తెలంగాణా ఎన్నికలను పరిశీలిస్తున్న ఏపీలోని మేధావులు, రాజకీయ విశ్లేషకులు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తు న్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ మరో కేసీఆర్ కాబోతారు! అని వారు తేల్చి చెబుతున్నా రు. అదేంటి? అని అనుకుంటున్నారా? అక్కడే వారు కూడా విశ్లేషణ చేస్తున్నారు. అధికారంలో లేకపోయినా.. ఇప్పుడు ఏపీలో జగన్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. నిజానికి ఎక్కడైనా అధికారంలో ఉన్నవారి చుట్టూ రాజకీయాలు జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణాలోనూ అదే కదా జరుగుతోంది. అక్కడ అధికారంలో ఉన్న నాయకుడు కేసీఆర్‌ను గద్దెదింపేందుకు అన్ని పక్షాలూ ఏకమై పోరాటం చేస్తున్నాయి. దీనికి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సహకరిస్తున్నారు.
తెలంగాణపై రాహుల్ .....
ఈ క్రమంలోనే మహాకూటమి ఏర్పడింది. దీనిలో నాలుగు పార్టీలు మూకుమ్మడిగా కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రయత్ని స్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అతిపెద్ద ఎన్నికల రాష్ట్రం రాజస్థాన్‌లోనూ ప్రచారాన్ని ఇన్ని రోజులు నిర్వహించలేదు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. డిసెంబరు 7నే అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి. అయితే, రాహుల్ మాత్రం తన దృష్టిని తెలంగాణాపైనే పెట్టారు. ఇక, చంద్రబాబు కూడా తెలంగాణాలోకి వెళ్లను అంటూ వెళ్లారు.. ఏపీ వాళ్లు ఏమీ అనరలే అనే ధైర్యంతోనే జై తెలంగాణా అనేశారు. ఇప్పుడు ఇదీ తెలంగాణా ఎన్నికల పరిస్థితి కట్ చేస్తే.. ఏపీలో మాత్రం జగన్‌కు వ్యతిరేకంగా పార్టీలు ఏకమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
జగన్ ను ఏకాకిని చేసి....
దీనికి కారణం ఏంటి? అంటే ఒక్కటే ప్రజలు ఇప్పుడు జగన్‌ను కోరుతుండడమే! నిజానికి విశాఖలో హత్యా యత్నం తర్వాత జగన్‌కు ఏమీ మైలేజీ రాలేదని టీడీపీ కానీ, జనసేన కానీ కాంగ్రెస్ కాని ప్రచారం చేసినట్టుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితి లేదు. ఆయనకు అనుకూలంగా ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. ఒకరకంగా పవన్ చేస్తున్న యాంటీ ప్రచారం కూడా జగన్‌కు ప్లస్ కాబోతోంది. ఈ నేపథ్యంలో జగన్‌ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ టీడీపీలు సంయుక్తగా పోటీ చేస్తున్న విషయాన్ని ఇటీవల కాంగ్రెస్ నాయకులే బయట పెట్టారు. అంటే.. జగన్ సెంట్రిక్‌గా ఏపీలో రాజకీయాలు మారిపోతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ లతో పాటు మరికొన్ని వామపక్ష పార్టీలు కూడా కలిసే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ రసకందాయ రాజకీయంలో ఏపీ కేసీఆర్ జగనేనని వేరే చెప్పాల్సిన పనిలేదు.