రాష్ట్రంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. విపక్షం వైసీపీ వ్యూహా త్మకంగా ముందుకు కదులుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసమే కాకుండా.. ప్రజల్లో ఒక విధమైన భరోసా కల్పించాలనే ధ్యేయంతో వైసీపీ అధినేత జగన్‌ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన గురించి, తాను అధికారంలోకి వస్తే.. ఒనగూర్చే ప్రయోజనాల గురించి పెద్ద ఎత్తున చెప్పుకొంటున్నారు. ఈ క్రమంలోనే 2004లో సాగిన రాజన్న పాలన, దానితాలూకు ఒనగూరిన ఫలాలు వంటి వాటిని ప్రచారం చేస్తున్నారు. నిజానికి వైఎస్ పాలించింది ఐదేళ్లే అయినా.,. చాలా మంది గుండెల్లో పార్టీలకు అతీతంగా ఆయన చోటు సంపాయించుకునేలా వ్యవహరించారు.
ఏ ఒక్కరూ సాహించక......
ఆయన ప్రవేశ పెట్టిన ప్రతి పథకం కూడా ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. వాస్తవానికి ఏదైనా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను తదుపరి వచ్చే ప్రభుత్వం తుడిచి పెట్టేస్తుంది. ఆ పథకాలను బుట్టదాఖలు చేస్తుంది. లేదా పేర్లు సైతం మార్చేస్తుంది. కానీ, వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలను పేర్లు మార్చేందుకుకానీ, అసలు వాటిని బుట్టదాఖలు చేసేం దుకు కానీ ఏ ఒక్కరూ సాహసించలేని పరిస్తితిని ఆయన తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే 'ఆరోగ్య శ్రీ', 108 అఖండ ప్రజల మనసుల్లో అమోఘంగా నిలిచిపోయాయనడంలో అసత్యం ఎంతమాత్రమూ లేదు. అలాంటి పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రధానంగా సాధారణ ప్రజలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేసిన ఘనత వైఎస్‌దే. దీంతో ఆయన పాలన మళ్లీ వస్తే.. తమకు ఆరోగ్య భరోసా లభిస్తుందని అంటున్నారు.
తండ్రి ఆశయాలను.....
ఇప్పుడు జగన్ చెబుతున్నది కూడా అదే! తన తండ్రి వారసత్వాన్ని, ఆశలను, ఆశయాలను కూడా తాను నిలబెడతానని, ప్రజలకు మళ్లీ రాజన్న రాజ్యాన్ని, పాలనను అందిస్తానని ప్రతిజ్ఞా పూర్వక హామీని ఇస్తున్నారు. ఈ క్రమంలోనే 'రావాలి జగన్' కార్యక్రమాన్ని ఉద్రుతం చేయాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలోనూ మండల కేంద్రంలోనూ ఈ తరహా కార్యక్రమాలను ఉధృతం చేయాలని జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక, ప్రజాదరణలో ఫస్ట్ ఉన్న వైసీపీ నాయకులు.. సైతం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లనున్నారు. రాజన్న అందించిన పాలనా ఫలాలు మళ్లీ ప్రజలకు చేరువ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని బృహత్తరంగా నిర్వహించాలని నిర్ణయించారు.
పార్టీ కార్యక్రమాలతో.....
ఫలితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ఏకపక్షం కావాలని ఆశిస్తున్న వైసీపీ అధినేత జగన్ ఆదిశగా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నవరత్నాలు వంటి కీలక కార్యక్రమాన్ని ఉధృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమం ముగుస్తున్న నేపథ్యంలోనే కావాలి జగన్-రావాలి జగన్ కార్యక్రమానికి కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఇది కూడా బాగా సక్సెస్ రేటు సాధిస్తుండడం గమనార్హం. వచ్చేఎన్నికల్లో చంద్రబాబు ను ఓడించి తీరడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న జగన్‌కు ఈ కార్యక్రమాలు హిట్ అవుతుండడం మరింత కలిసొచ్చే అంశంగా మారడం విశేషం. మరి జగన్ మున్ముందు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.