స‌ర్వే ఫ‌లితం.. జ‌గ‌న్ మ‌రింతగా....!!

Update: 2018-09-17 02:00 GMT

మార్పు స‌హజం.. నిరంత‌రం మార్పు అవ‌స‌రం! ఈ ప్రకృతి కూడా నిరంతరం త‌న‌లో అనేక మార్పులు చేసుకుంటూనే ఉంటుంది. సో.. మార్పున‌కు అలవాటైన వ్యక్తులు నిరంత‌రం ప్రజ‌ల మ‌ధ్య ఉంటారేమో! ఇప్పుడు ఇలాంటి మార్పే వైసీపీకి అవ‌స‌ర‌మేమో..? అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. తాజాగా ఓ స‌ర్వే వెలుగు చూడ‌డ‌మేన‌ని చెబుతు న్నారు. ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా సంయుక్తంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల్లో స‌ర్వే నిర్వహించాయి. ఈ క్రమంలో ఏపీలోనూ ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. అనే కాన్సెప్టుతో స‌ర్వే చేప‌ట్టాయి. ఈ క్రమంలో ప్రతిప‌క్ష నాయ‌కుడిగా జ‌గ‌న్‌కు .. అధికార ప‌క్షం టీడీపీతో పోల్చుకుంటే మంచి మార్కులే ప‌డ్డాయి. కానీ, ఇవి ఆశించిన మార్కులు కావ‌నేది విశ్లేష‌కుల మాట‌.

సర్వే ఫలితాల్లో......

ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదురోజుల పాటు దాదాపు 10,650 మంది నుంచి సమాచారం సేకరించారు. ఈ సర్వేలో టీడీపీ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతప్తితో ఉన్నట్టు తేలింది. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని, కాబోయే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వైపు ఏపీ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది. సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే జగన్‌మోహన్‌రెడ్డికి 43% మంది ఓటేశారు. చంద్రబాబుకు 38%, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు 5% మద్దతిచ్చారు. 36% మంది ప్రజ‌లు చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై బాగాలేదని, 18% ఓ మోస్తరుగా ఉందని స్పష్టం చేశారు. ఇది బాగానే ఉంది. దీనిపై చ‌ర్చ కాదు.. కానీ దీనిని విశ్లేషిస్తూ.. సాగాల్సిన చ‌ర్చ చాలా ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ఇద్దరి మధ్య తేడా......

అదేంటంటే.. చంద్రబాబు సీఎం అభ్యర్థిగా అంగీక‌రిస్తున్నవారు 38% మంది ఉండ‌గా.. జ‌గ‌న్‌కు 43% మంది ఉన్నారు. అంటే ఇద్దరి మ‌ధ్య కేవ‌లం తేడా 5%. కానీ, ఇద్దరి క‌ష్టాన్ని చూసుకుంటే.. గ‌త ఏడాది న‌వంబ‌రు నుంచి కూడా జ‌గ‌న్ ఎండ‌న‌క వాన‌న‌క క‌ష్టప‌డుతున్నాడు. నిత్యం ప్రజాసంక‌ల్ప యాత్రతో ప్రజ‌ల్లోనే ఉంటున్నారు. మ‌రి అలాంటి స‌మ‌యంలో జ‌గ‌న్‌కు ఇప్పుడు వ‌చ్చిన‌ మార్కులు మ‌రీ అంత ఎక్కువ కాదు అనేది ప్రధాన ప్రశ్న. ఇక‌, అదేస‌మ‌యంలో చంద్రబాబుకు తీవ్ర వ్యతిరేకత ఉంద‌ని అంటున్నప్పటికీ.. ఆయ‌న‌కు 38% మంది ఓకే చెప్పడం గ‌మ‌నార్హం.

మరింతగా కష్టపడి.......

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యంలో చాలానే ఉంది కాబ‌ట్టి.. చంద్రబాబు పుంజుకునే అవ‌కాశాన్ని కొట్టిపారేయ‌లేం. సో.. ఏదేమైనా..జ‌గ‌న్ మ‌రింత‌గా క‌ష్టించాల్సిన‌, మార్పు తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక జ‌గ‌న్ ఇప్పట‌కీ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త అభ్యర్థుల‌ను రంగంలోకి దించుతున్నారు. అయితే అదే టైంలో అప్పటి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కోసం క‌ష్టప‌డిన వారు ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. వీరికి అడ్డుక‌ట్ట వేయాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. అప్పుడే వైసీపీ మ‌రింత పుంజుకునే ఛాన్సులు ఉన్నాయి. మ‌రి జ‌గ‌న్ ఈ విష‌యంలో ఎలా దృష్టి పెడ‌తాడో ? చూడాలి.

Similar News