నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ అధినేత వ్యూహం ఫలిస్తుందా...? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టినట్లు కన్పిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ తనకు అందుతున్న నివేదికల ప్రకారం చర్యలు తీసకుంటున్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారు. నేతలు అసంతృప్తికి గురైనా సరే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. విషయంలోకి వెళ్తే.. ఎస్సీ నియోజకవర్గం గూడూరులో 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ రేంజ్‌లో విజయం సాధించింది. దాదాపు 9 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో పాశం సునీల్ ఇక్కడ నుంచి జయకేతనం ఎగుర వేశారు.
వైసీపీ పై గెలిచి వెళ్లిపోవడంతో....
అయితే, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆకర్ష్ మంత్రానికి వశుడైన పాశం సునీల్ సైకిల్ ఎక్కారు. నియోజకవర్గం అభి వృద్ధి కోసమే తాను పార్టీ మారానని చెప్పుకొన్నారు. సరే! ఇదిలావుంటే, పాశం లేకపోవడంతో వైసీపీకి నాయకత్వం ఎవరు వహిస్తారు? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. ఈ క్రమంలో కొత్త ఇన్‌చార్జిని నియమించడం కోసం అభిప్రాయ సేకరణ జరిగింది. జగన్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఈ పదవికి వీరి చలపతి, బత్తెన విజయ్ కుమార్, మేరిగ మురళీధర్ లు పోటీపడ్డారు. మెజారిటీ నాయకులు మురళీధర్‌ను బలపరచడంతో ఆయన్ను ఇన్‌చార్జిగా నియమిం చారు. అయితే, ఇటీవల నియోజకవర్గంలో నిర్వహించిన సర్వేలో మేరిగ మురళీధర్ పనితీరు బాగోలేదని రిజల్ట్ వచ్చింది.
పక్కన పెట్టడానికి.....
దీంతో ఈయనను పక్కకు పెట్టారని సమాచారం. మేరిమురళీధర్‌ను పక్కన పెట్టడానికి ఆయన పనితీరే కారణమని చెబుతున్నారు. స్థానిక నేతలతో సమన్వయం చేసుకుని వెళ్లకపోవడం, గ్రూపులను పార్టీలో ప్రోత్సహించడంతో ఆయనను తప్పించారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పేర్నేటి, నేదురుమల్లిల మనిషిగా బత్తెన విజయకు మార్ తెరపైకి వచ్చారు. నేదురుమల్లి రాంప్రసాద్‌రెడ్డి వైసీపీలో చేరుతున్న సందర్భంగా గూడూరు డివిజన్‌లోని మూడు నియోజకవర్గాలు గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను అప్పగించారు. జగన్ ఆదేశాల మేరకు రామ్‌కుమార్‌రెడ్డి తొలి దశలో గూడూరు నియోజకవర్గంపై దృష్టి సారించారని, ఈ క్రమంలో ఇన్‌చార్జిని మార్చాలనే నిర్ణయం జరిగిందని అంటున్నారు. పేర్నేటి, నేదురుమల్లిల మనిషిగా బత్తెన విజయ్‌కు మార్ పేరుని యోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగు తోంది. మొత్తం మీద జగన్ గెలుపు లక్ష్యంగానే పార్టీలో అలసత్వం వహించేవారిని సహించేది లేదన్న సంకేతలను పంపారంటున్నారు.