రాజమండ్రి వైసీపీ లో అసంతృప్తి జ్వాలలు …?

రాజమండ్రి వైసీపీ నేతలకు తాము అధికారం లో ఉన్నామా లేక ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామో అర్ధం కావడం లేదని ఆఫ్ ది రికార్డ్ లో వాపోతున్నారు. ప్రజలకు [more]

Update: 2020-09-06 02:00 GMT

రాజమండ్రి వైసీపీ నేతలకు తాము అధికారం లో ఉన్నామా లేక ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామో అర్ధం కావడం లేదని ఆఫ్ ది రికార్డ్ లో వాపోతున్నారు. ప్రజలకు సంబంధించి ఏ సమస్యను అధికారుల దృష్టిలో పెట్టినా వారు పట్టించుకోవడం లేదన్నది అధికారపార్టీ నేతల ఆవేదన. తమను పట్టించుకోకపోతే పోయారు తెలుగుదేశం పార్టీ నేతలు అడిగిందే తడవు వారికి చక్కగా పనులు చేసి పెట్టడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదని ఫ్యాన్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ ఇన్ ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లినట్లు తెలుస్తుంది. అయితే దీన్ని త్వరలోనే సెట్ చేస్తానని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారని ప్రచారం సాగుతుంది.

టార్గెట్ కమిషనర్ …

రాజమండ్రి కమిషనర్ అభిషిఖ్త్ కిశోర్ కు వైసీపీ సిటీ ఇన్ ఛార్జ్ శివరామ సుబ్రహ్మణ్యం నడుమ గత కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తుంది. అదీ కరోనా సమయంలో మరింతగా ముదిరి పాకాన పడినట్లు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు అద్దం పట్టాయని వైసీపీ లో టాక్. కరోనా రాజమండ్రిలో వీర విజృంభణకు కారణం కమిషనర్ వైఖరే నని సుబ్రహ్మణ్యం బాహాటంగానే ప్రకటించేశారు. ఆయనకు నగరం పై అవగాహన లేకపోవడంతో కరోనా కట్టడిలో అట్టర్ ఫెయిల్ అయ్యామని ఏ ఆసుపత్రిలో ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి ఎక్కడ ఎలా చర్యలు తీసుకోవాలో తెలియడం లేదని శివరామ సుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు కూడా.

ఎవరో ఒకరే ఉండాలి …

పేద గర్భీణీలకు ఉపయోగపడే కొన్ని కేంద్రాలను కోవిడ్ సెంటర్స్ గా ఏర్పాటు చేయొద్దని ప్రభుత్వ ఆసుపత్రికి సాధారణ రోగులు వెళ్లలేని పరిస్థితిలో ఈ ఆసుపత్రులు వారికి పనిచేస్తాయని వైసీపీ కమిషనర్ కి విన్నవించింది. అయితే నిర్ణయం జరిగిపోయిందని చెప్పిన కమిషనర్ తరువాత టిడిపి వారు వినతిపత్రం ఇస్తే తన నిర్ణయాన్ని విరమించుకున్నట్లు ప్రకటించడాన్ని అధిష్టానం ముందు పెట్టారని తెలుస్తుంది.

రహదారి విస్తరణ పనులను….

అలాగే కరోనా సమయంలో నగరంలో పేద వర్గాలు నివశించే ప్రాంతాల్లో రహదారి విస్తరణ పనుల పేరుతో ప్రొక్లెయిన్లు పెట్టి కూల్చివేతలకు కమిషనర్ దిగుతున్నారని అదీ వైసీపీ ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉన్న చోట్ల చేస్తున్నారని సుబ్బారెడ్డికి ఫిర్యాదు వెళ్ళిందంటున్నారు. ఇలా అనేక సందర్భాల్లో టిడిపి కి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా అధికారుల వ్యవహార శైలి ఉండటం వల్ల వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి భంగపాటు తప్పదని అధికార వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో తీసేస్తే తన కో ఆర్డినేటర్ తీసేయాలని లేదా కమిషనర్ ను పంపేయాలంటూ శివరాముడు పట్టుపట్టినట్లు ప్రచారం హాట్ టాపిక్ అయ్యింది.

Tags:    

Similar News