కొణతాలకు వైసీపీ నో...?

Update: 2018-10-07 15:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది అర్ధం కావడం లేదు. ఒకనాడు చక్రం తిప్పిన కొణతాల ఇపుడు ఏ వైపునకు వెళ్ళలో తెలియక దిక్కులు చూస్తున్నారు. వైసీపీలో మళ్ళీ చేరుదామనుకుంటే ఆ పార్టీ నో ఎంట్రీ బోర్డ్ చూపిస్తోందని టాక్. కొణతాల రాకను సక్షాత్తు అధినేత జగనే వ్యతిరేకిస్తున్నారట. కొణతాల వైసీపీలో ఉండగా జగన్ ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చారు. ఆ సమయంలో జరిగిన 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ బరిలో వైఎస్ విజయమ్మ పోటీ చేశారు. ఆమెను గెలిపించే కీలకమైన బాధ్యతను జగన్ కొణతాలకు అప్పగించారు. అయితే కొణతాల ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని, ఫలితంగానే విజయమ్మ ఓటమి పాలు అయ్యారని జగన్ ఇప్పటికీ నమ్ముతున్నారు. ఈ కారణంగానే మళ్ళీ కొణతాల వైసీపీ వైపు చూస్తున్నా జగన్ నో అంటున్నారని టాక్.

సైకిలెక్కేస్తారా .....

కొణతాలా కాంగ్రెస్ రాజకీయాల్లో పుట్టి పెరిగిన వారు. అందువల్ల ఆయన అంత తొందరగా వేరే పార్టీలోకి జంప్ చేయలేకపోతున్నారు. నిజానికి ఆయన వియ్యంకుడే అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కొణతాలను టీడీపీలోకి రమ్మని బలవంతం చేస్తున్నారు. అటు అధినాయకత్వంతోనూ రాయబారాలు నడుపుతున్నారు. అయితే కొణతాల మాత్రం మౌనం పాటిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరో వైపు కొణతాల జనసేనలో చేరుతారని కూడా టాక్ నడుస్తోంది. ఆ పార్టీ అధినేత పవన్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసిన సమయంలో కొణతాలను కూడా పిలిచారు. అలా ఆయన జనసేనకు కూడా సన్నిహితంగావే ఉంటున్నారు.

ఎంపీగా పోటీ చేస్తారా....?

అనకాపల్లి ఎంపీగా 1989లో రాజకీయ ఆరంగేట్రం చేసిన కొణతాల వచ్చే ఎన్నికల్లో మరో మారు ఇక్కడ నుంచే ఎంపీగా బరిలోకి దిగుతారా అన్న అనుమానాలు వస్తున్నాయి. టీడీపీలో కనుక చేరితే కొణతాలను ఎంపీగా టికెట్ ఇచ్చి బరిలోకి దింపాలని ఆ పార్టీ అనుకుంటోందట. మరి మాజీ మంత్రి గారు మౌనం వీడి రేపటి ఎన్నికల్లో పార్టీ జెండాగా టీడీపీని తగిలించుకుని రంగంలోకి దిగుతారని టాక్ నడుస్తోంది. అది ఎంతో దూరంలో లేదని కూడా అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా ఒకనాడు విశాఖ జిల్లాను ఏకచత్రాధిపత్యంగా శాసించిన కొణతాల రాజకీయం ఏంటన్నది అర్ధం కాక అనుచరులు, అభిమానులు తల్లడిల్లిపోతున్నారు.

Similar News