వైసీపీ, టీడీపీల మాస్టర్‌ స్ట్రాటజీలు మామూలుగా లేవే..!

వైసీపీ, టీడీపీలు తమ తమ వ్యూహాలను మార్చుతున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు గట్టిగా

Update: 2023-06-06 05:42 GMT

 andhra pradesh

అసెంబ్లీ ఎన్నికలు.. ఆంధ్రప్రదేశ్‌లో కంటే ముందు తెలంగాణ జరగాల్సి ఉంది. ఈ సమయంలో తెలంగాణలో రాజకీయాలు దుమ్ము రేపాలి.. కానీ విచిత్రంగా ఏపీలో హాట్‌ హాట్‌గా రాజకీయాలు సాగుతున్నాయి. ఎండాకాలంలో మరింత హీట్‌ పుట్టిస్తున్నాయి. వైసీపీ, టీడీపీలు తమ తమ వ్యూహాలను మార్చుతున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మరో 10 నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చినా.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికల జరిగినా.. ఈ మధ్య కాలంలో ఆయా పార్టీల అధినేతలు పూర్తిస్థాయిలో ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తమ తమ హామీలు, మేనిఫెస్టోలతో జనాల్లోకి మరింత లోతుగా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇప్పటికే రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫోస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అటు చంద్రబాబు కూడా పక్కా ప్లాన్‌తో జిల్లాల వారీగా లేదంటే మండలాల వారీగా యాత్రలు చేసి ప్రజల్లోకి వెళ్లాలి అనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారని సమాచారం. ఎన్నికల్లో గెలుపుకు ఇది కీలక సమయం కావడంతో వైసీపీ అధినేత జగన్‌ కూడా ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రకటించిన ఉచితాలవైపు ప్రజలు మళ్లకుండా వైసీపీ తన వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే సన్నద్ధంగా ఉండాలని వైసీపీ అధినాయకత్వం.. పార్టీ నేతలకు, శ్రేణులకు చెబుతూ వస్తోంది.

ఇప్పటికే ప్రజా ప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రతీ కుటుంబాన్ని కలిసి వస్తున్నారు. టీడీపీ మినీ మేనిఫెస్టోని ఎండగడుతూ వైసీపీ వ్యూహాత్మక ఆలోచన దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలను పూర్తి స్థాయిలో తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు మరింత ఎక్కువగా చేస్తోంది. మరీ ప్రజలజు ఎన్నికల్లో ఎవరి వైపు మొగ్గుతారనేది చూడాల్సి ఉంది. వైసీపీ ఇప్పటికే ఇస్తున్న పథకాలు చూసి వైసీపీ వైపే ఉంటారా?.. చంద్రబాబు ఇస్తానంటున్న పథకాలను చూసి టీడీపీ వైపు మొగ్గుతారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. కాగా వైసీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు మరో రెండ్రోజుల్లో మాస్టర్ ప్లాన్ ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

Tags:    

Similar News