స్పెషల్ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి : సీఎం కేసీఆర్
గవర్నర్ పదవి ఒక అలంకారప్రాయమైనదేనని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టినా ఇంకా తీరు మార్చుకోలేదని..
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కేంద్రంలో ఉన్న బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ లు సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. అనంతరం మూడు రాష్ట్రాల సీఎంలు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రాలకు సీఎంలు ఉండగా.. బీజేపీ గవర్నర్ల వ్యవస్థను ఎందుకు ప్రోత్సహిస్తుందని ప్రశ్నించారు.
గవర్నర్ పదవి ఒక అలంకారప్రాయమైనదేనని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టినా ఇంకా తీరు మార్చుకోలేదని విమర్శించారు. కేంద్రం వెంటనే కళ్లు తెరిచి అధికారుల పోస్టింగులు, బదిలీలపై తెచ్చిన స్పెషల్ ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాట్లాడుతూ.. గవర్నర్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ ప్రభుత్వాన్ని కూడా కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని వాపోయారు. రాజ్ భవన్ లను బీజేపీ పార్టీ ఆఫీసులుగా మార్చేస్తున్నారని భగవంత్ తెలిపారు. కేంద్రం వైఖరి ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తోందని, కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.