బీఆర్ఎస్ గా టీఆర్ఎస్.. జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన లేఖపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను..

Update: 2022-12-09 08:19 GMT

తెలంగాణ ఉద్యమం నుండి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. ఇకపై జాతీయ పార్టీగా భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా ఆవిర్భవించనుంది. పార్టీ పేరును మారుస్తూ..కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ లేఖ రాసింది. ఈ సందర్భంగా.. ఈ రోజు మధ్యాహ్నం 1.20 గంటలకు శుభముహూర్తంలో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన లేఖపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సినీనటుడు, రాజకీయనాయకుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. గులాబీ జెండా మధ్యలో భారతదేశాన్ని ముద్రించి.. జాతీయ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ జెండా రంగు, గుర్తు మాత్రం మారలేదు. 22 ఏళ్ల టీఆర్ఎస్ ను.. ఇకపై ప్రజల్లోకి బీఆర్ఎస్ గా తీసుకెళ్లే అంశంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.





Tags:    

Similar News