ఏపీలో వేడెక్కిన రాజకీయం.. ప్రధాన పార్టీల్లో కలవరం!
షెడ్యూల్ ప్రకారమైతే.. ఏపీలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అయితే రాజకీయ పార్టీల హడావిడి చూస్తుంటే..
షెడ్యూల్ ప్రకారమైతే.. ఏపీలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అయితే రాజకీయ పార్టీల హడావిడి చూస్తుంటే.. రేపో, ఎల్లుండో ఎన్నికల వస్తాయి అన్నట్టుగా అనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పినా.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పార్టీలు నమ్మడం లేదు. సీఎం జగన్ ఎన్నికల విషయంలో అబద్దాలు ఆడుతున్నారని జనసేన అధినేత పవన్ అంటున్నారు. ఈ ఏడాది చివరిలో ఎప్పుడైనా ఎన్నికలు రావడం ఖాయమని ఇటీవల ఓ సభలో చెప్పారు. ఎన్నికలపై ప్రతిపక్షాల హడావిడితో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎవరికీ తోచిన విధంగా వారు సర్వేలు, ప్రకటనలు చేస్తున్నారు.
ఎవరు, ఎప్పుడు, ఏ విధంగా సర్వేలు చేస్తున్నారో తెలియదు కానీ.. ఏ పార్టీ విజయం సాధిస్తుందో, ఏ పార్టీ ఓడిపోతుందో లెక్కలతో మరీ ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఓ వైపు ప్రజలు, మరో వైపు పార్టీలు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ఓ సర్వే ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపడుతుందని తెలిపింది. అయితే ఇవి నిజమైన సర్వేలేనా అంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుకూలంగా వచ్చిన సర్వేలను చూసి ఆ పార్టీలు సంబరాలు చేసుకుంటుంటే.. మిగతా పార్టీలు ఆ సర్వేలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ సర్వేలతో ప్రతిపక్ష పార్టీలకు ఓటమి భయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు...తనకంటూ సొంత ముద్ర వేసుకునేలా ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని, అలాంటప్పుడు ఆయన గెలుపు అసాధ్యమే అని అంటున్నారు. మరో వైపు బీజేపీతో కలవాలని టీడీపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నప్పటికి.. కాషాయ పార్టీ మాత్రం దూరంగా జరుగుతూ వస్తోంది. దీనికి తోడు జనసేన, టీడీపీల పొత్తులు ఇంకా కుదరలేదని సమాచారం. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం చేసుకుంటున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉంది. అప్పటి వరకు అనేక మార్పులు, రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది.