హిమాచల్ ప్రదేశ్ లో మొదలైన పోలింగ్.. 68 మంది ఎమ్మెల్యేలు, 55 లక్షల మంది ఓటర్లు
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 55.92 లక్షల మంది ఉండగా.. పురుష ఓటర్లు 28.54 లక్షలు, మహిళా ఓటర్లు 27.37 లక్షలు మంది ఉన్నారు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుండి పోలింగ్ ప్రారంభమవగా.. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ లకు వెళ్తున్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో 48 జనరల్ సీట్లు, 17 ఎస్సీ రిజర్వ్ డ్, 3 ఎస్టీ రిజర్వ్ డ్ స్థానాలున్నాయి.
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 55.92 లక్షల మంది ఉండగా.. పురుష ఓటర్లు 28.54 లక్షలు, మహిళా ఓటర్లు 27.37 లక్షలు మంది ఉన్నారు. 38 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ- కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రాహుల్ భారత్ జోడో యాత్ర ఈ ఎన్నికలపై ఎంతవరకూ ప్రభావం చూపుతుందో చూడాలి.