ఎన్డీఏ మీటింగ్‌కు పవన్‌.. టీడీపీ లాబీయింగ్‌ కోసమేనా?

జులై 18న జరగనున్న బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) సమావేశానికి హాజరయ్యేందుకు జనసేన పార్టీ

Update: 2023-07-17 09:22 GMT

జులై 18న జరగనున్న బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) సమావేశానికి హాజరయ్యేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ న్యూఢిల్లీ వెళ్లనున్నారనే విషయం ఇప్పుడు ఖాయం కావడంతో.. తెలుగుదేశం పార్టీ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. జులై 18న జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ నుంచి పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందిందని, అందుకు ఆయన సమ్మతించారని జనసేన పార్టీ ప్రకటించింది. ఆయన తన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి సోమవారం దేశ రాజధానికి వెళ్లనున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నంగా కనబడుతోంది.

అయితే మళ్లీ ఎన్డీయేలోకి వచ్చేందుకు తెర వెనుక లాబీయింగ్ చేస్తున్న టీడీపీకి ఇప్పటి వరకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రాలో టీడీపీకి బీజేపీ మద్ధతు లభిస్తుందన్న ఆశతో చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామ్యానికి సంబంధించి బీజేపీ జాతీయ నాయకత్వం మదిలో ఏముందో కనుక్కోవాలని పవన్‌ను చంద్రబాబుని కోరినట్లు సమాచారం. “ఇంతకుముందు చెప్పినట్లుగా, పవన్‌కు మూడు ఎంపికలు ఉన్నాయి. బీజేపీతో పొత్తు కొనసాగించడం లేదా బిజెపితో పొత్తును తెంచుకోవడం, టీడీపీతో సంబంధాలను పునరుద్ధరించడానికి బీజేపీ ఆసక్తి చూపని సందర్భంలో టీడీపీతో చేతులు కలపడం, లేదా టీడీపీ-జనసేన పార్టీ కూటమిలో భాగమయ్యేలా బీజేపీని ఒప్పించడం’’ అని రాజకీయ వర్గాలు తెలిపాయి.

మంగళవారం నాటి ఎన్‌డీఏ సమావేశంలో జనసేన పార్టీ అధినేత తన బ్లూప్రింట్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం ముందు సమర్పించనున్నారని సమాచారం. టీడీపీతో చేతులు కలిపేందుకు పవన్‌కు ఆసక్తి ఉంటే, అతను నిశ్శబ్దంగా ఎన్డీయే సమావేశం నుండి బయటకు వెళ్లవచ్చు. అయితే ఆయన ఈ సమావేశానికి హాజరవుతున్నారంటే, ఆయన బీజేపీతో బంధాన్ని కొనసాగించాలనే ఆసక్తితో ఉన్నారని తెలుస్తోంది. ఎన్డీయే సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో స్పష్టత వస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News