Kesineni Nani : కేశినేని నాని ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తున్నారా? రెడీ అయిపోయారా? షరతులు ఇవేనట

కేశినేని నాని వైసీపీలో చేరుతున్నట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు చెబుతున్నా

Update: 2024-01-10 02:38 GMT

కేశినేని నాని వైసీపీలో చేరుతున్నట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళుతున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన కేశినేని నాని త్వరలో పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. అలాగే పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాను వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. అయితే ఏ పార్టీ నుంచి కేశినేని నాని పోటీ చేస్తారన్న దానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. తన అనుచరులతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

ప్రచారమేనా?
అయితే వైసీపీ నేతలతో కేశినేని నాని చర్చించినట్లు బెజవాడలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నెల 11వ తేదీన కేశినేని నాని వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు కూడా అంటున్నారు. తనతో పాటు కుమార్తె కేశినేని శ్వేత కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నానితో పాటు అదేరోజు మరికొందరు టీడీపీ నేతలు కూడా వైసీపీలో చేరతారన్న వదంతులు బాగానే వ్యాప్తి చెందాయి. అయితే దీనిని అధికారికంగా మాత్రం కేశినేని నాని ప్రకటించలేదు. ఆయన అనుచరుల నుంచి మాత్రం అనేక లీకులు బయటకు వస్తున్నాయి. అందులో అనేక రకాలుగా షరతులు పెట్టారని కూడా అంటున్నారు.
షరతులు ఇవే...
తనకు విజయవాడ పార్లమెంటు సీటుతో పాటు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో తాను సూచించిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని కేశినేని నాని కోరినట్లు చెబుతున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తన కూతురు కేశినేని శ్వేతకు, పశ్చిమ నియోజకవర్గం నుంచి మజీ ఎమ్మెల్యే బేగ్, నందిగామ నియోజకవర్గం నుంచి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాసు, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావులకు టిక్కెట్లు ఇవ్వలని కేశినేని నాని సంప్రదింపులు పంపారని తెలిిసింది. అయితే ఎంపీ టిక్కెట్ తో పాటు రెండు సీట్లు మాత్రమే ఇస్తామని వైసీపీ చెబుతున్నట్లు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
వైసీపీ మాత్రం...
కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం ఖాయం. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం ఇంకా అధికారికంగా తెలియరాలేదు. ఆయన స్పీకర్ ను కలసి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చిన తర్వాత తన అనుచరులతో సమావేశమైన అనంతరమే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముందని కూడా కేశినేని నాని సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీ ఐదు అసెంబ్లీ స్థానాలను ఇచ్చేందుకు మాత్రం ఇష్టపడదు. ఇప్పటికే నాని సూచించిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో ఆయన ఏమి చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో బెజవాడ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయని చెప్పొచ్చు.
Tags:    

Similar News