తెలంగాణ నెక్స్ట్‌ సీఎం కేటీఆర్?.. బీఆర్‌ఎస్‌లో ఊహాగానాలు!

ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పనిచేస్తున్న తన కుమారుడు కేటీఆర్‌ రాజకీయ స్థాయిని పెంచాలని

Update: 2023-07-02 12:46 GMT

తెలంగాణ నెక్స్ట్‌ సీఎం కేటీఆర్?.. బీఆర్‌ఎస్‌లో ఊహాగానాలు!

ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పనిచేస్తున్న తన కుమారుడు కేటీఆర్‌ రాజకీయ స్థాయిని పెంచాలని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) చీఫ్ కె చంద్రశేఖర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయనున్నారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని రాజకీయ వర్గాలు గుస గుసలాడుకుంటున్నాయి.

ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కేటీఆర్‌ ఇటీవల జరిపిన సమావేశాల తర్వాత ఆయన తన కుమారుడి రాజకీయ స్థాయిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్‌ తన కుమారుడికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల పగ్గాలు అప్పగిస్తారని, ఆ తర్వాత ఆయనకు ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తారని గతంలో ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలు కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడం, మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ఆసక్తి వంటి చర్చల మధ్య, కేసీఆర్ ప్రభుత్వ బాధ్యతను తన కుమారుడు కేటీఆర్‌ అప్పగించే అవకాశం ఉందని ఇటీవల ఓ వార్త షికారు చేస్తోంది.

రాష్ట్ర వ్యవహారాల్లో కేటీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రత్యేకించి పలు మంత్రిత్వ శాఖల్లో జోక్యం చేసుకోవడంతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడంతో ఆయనకు రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో పార్టీ నేతలు కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు నెరపేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ, పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగా ముఖ్యమంత్రి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అయితే, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ కనుసన్నల్లోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని పార్టీ నేతలు గ్రహించారు.

Tags:    

Similar News