ఏపీ పాలిటిక్స్‌లోకి షర్మిల.. కాంగ్రెస్ ప్లాన్!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం

Update: 2023-06-27 11:07 GMT

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. ఆమె పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ వారంలో చర్చల కోసం ఆమె న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని దాదాపు నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే, షర్మిల తెలంగాణపై మాత్రమే ఆసక్తి చూపుతుండగా, తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీల పాత్ర పోషించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

తనను ఏపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా చేయాలనే ప్రతిపాదన ఉందని, కర్ణాటక నుంచి తనకు కాంగ్రెస్ రాజ్యసభ టిక్కెట్టు ఆఫర్ చేశారంటూ వచ్చిన వార్తలను ఆమె బహిరంగంగానే కొట్టిపారేశారు. తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చడం కోసం తానెప్పుడూ కట్టుబడి ఉన్నానని, ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని ఆమె పునరుద్ఘాటించారు. తన భవిష్యత్తు తెలంగాణా ప్రజలతోనే ఉంది అని ఆమె అన్నారు. షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ అధిష్టానం ధీమాగా ఉన్నట్లు సమాచారం. భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్‌ఎస్) చంద్రబాబు నాయుడుని ఆంధ్రా నాయకుడిగా చూపి తెలంగాణ సెంటిమెంట్‌ను పూర్తిగా ఉపయోగించుకుని మళ్లీ అధికారంలోకి వచ్చింది.

షర్మిల తెలంగాణా కాంగ్రెస్‌లో చేరితే బీఆర్‌ఎస్ మళ్లీ అదే సెంటిమెంట్‌ను ప్లే చేసే అవకాశం ఉంది, ఎందుకంటే షర్మిలను ఆంధ్రాలో ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ సోదరి అని. అందుకే షర్మిల ఆంధ్రాకు వెళ్లి వైఎస్‌ఆర్‌ సెంటిమెంట్‌ను పుణికి పుచ్చుకుని పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఆ ప్రయత్నంలో విజయం సాధించకున్నా, ఆమె రాజకీయ ప్రయోజనాలను పార్టీ కాపాడుతుందని హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే షర్మిల దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News