ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌దేనా.. పొంగులేటి గెలిపిస్తాడా?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎదిగారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో

Update: 2023-07-20 11:08 GMT

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎదిగారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉన్న లీడర్‌గా పొంగులేటి ఉన్నారు. ఇటీవలే ఖమ్మంలో కాంగ్రెస్‌ నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇదే సభలో పొంగులేటి అనుచరులు, పలు పార్టీల నేతలు కూడా భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్ అయ్యారు. పొంగులేటిని బీజేపీ పార్టీలో చేరాలని చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, బీజేపీ నేతలు తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. పలు మార్లు చర్చలు జరిపారు. కానీ పొంగులేటి ఇందుకు ససేమిరా అన్నారు. పొంగులేటి గతంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ప్రజాభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ మార్పుపై ఖమ్మంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రధాన అనుచరులను పిలిపించుకొని వారి అభిప్రాయాలు సేకరించారు.

పొంగులేటి ప్రధాన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచించారు. వారు కోరినట్టుగానే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనుచరుల నిర్ణయమే.. తన నిర్ణయమని పొంగులేటి పలుమార్లు ప్రకటించారు. పొంగులేటి వర్గానికి చెందిన ఐదుగురికి ఎమ్మెల్యే టికెట్లు గ్యారంటీగా ఇస్తేనే కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం సాగింది.. తనతో పాటు మరో ఇద్దరికి సీటు ఖచ్చితంగా ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు నాయకులు అనుకున్నారు. కానీ కర్నాటక ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి చూసిన పొంగులేటి కాంగ్రెస్‌కి అనుకూల ఫలితాలు రావడంతో కాంగ్రెస్ పార్టీపై ఆసక్తి చూపారని తెలుస్తోంది. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరేముందు ఎటువంటి కండిషన్స్ పెట్టలేదట. ఈ నేపథ్యంలోనే ఆయన చేరికపై వెనుక భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడానికి చాలా కారణాలు ఉన్నాయని నేతలు అనుకుంటున్నారు. కానీ ఎవరు ఏమి అనుకున్న కూడా పొంగులేటి టార్గెట్ మాత్రం బీఆర్ఎస్‌ని గద్దెదించడం, కేసీఆర్ ప్రభుత్వాన్ని రాబోయే ఎలక్షన్లలో ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి తన సత్తా చూపిస్తానని ఛాలెంజ్ చేసారు. పొంగులేటి పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గం కూడా డిసైడ్ అవ్వలేదని, ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్‌లలో ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ ఉంటుందని అంటున్నారు. ఖమ్మం నుంచే పొంగులేటి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తారని కాంగ్రెస్ వర్గాల విశ్వసనీయ సమాచారం. పొంగులేటి వ్యూహాత్మకంగా నడుస్తున్నారని ఆయన అనుచరులే చెబుతున్నారు. పొంగులేటితో ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో ముందు ముందు జరిగే పరిస్థితులను ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది. 

Tags:    

Similar News