డిసైడింగ్ ఫ్యాక్టర్‌పై సీఎం జగన్‌ ఫోకస్

ఎన్నికలకు మరో 9 నెలలు సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మళ్లీ అధికారం చేపట్టే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల వ్యూహాలు అమలు

Update: 2023-06-08 09:33 GMT

ఎన్నికలకు మరో 9 నెలలు సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మళ్లీ అధికారం చేపట్టే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు. లెక్కలు వేసుకుంటూ.. ముందుకు అడుగులు వేస్తున్నారు. పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్‌ను ఎక్కడా పడి పోకుండా జాగ్రత్త పడుతున్నారు. ''9 నెలలు కష్టపడంది. మళ్లీ మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది'' అంటూ మంత్రులకు సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. నిన్నటి కేబినెట్‌ భేటీతో సీన్‌ మొత్తం మార్చేశారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న వేళ.. సీఎం జగన్‌ మరికొన్ని కీలక నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు.

గత ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ అమలు చేసిన ప్రాంతీయ, సామాజిక సమీకరణాల దెబ్బకు టీడీపీ ఘోరంగా పరాజయమైంది. ఎవరూ ఊహించని రితీలో టీడీపీకి 23, వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. ఇక ఇదే సీన్‌ను మళ్లీ రిపీట్‌ చేయాలని సీఎం జగన్‌ భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు చంద్రబాబు, వైఎస్‌ జగన్‌కు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇటీవల చంద్రబాబు.. టీడీపీ మేనిఫెస్టో ప్రకటించారు. దీనిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. సీఎం జగన్‌ మాత్రం తన సంక్షేమ పథకాలే తనకు తిరిగి అధికారాన్ని కట్టబెడతాయని చాలా ధీమాతో ఉన్నారు. త్వరలోనే లబ్ధిదారులను పెరిగేలా చేయడమే లక్ష్యంగా.. సంక్షేమ చక్ర పేరుతో ఈ నెల 15వ తేదీ నుంచి డోర్ డోర్ టు సర్వేను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.

ఎన్నికల సమయం కావడంతో ఉద్యోగుల సమస్యలపై నిన్నటి కేబినెట్‌ భేటీలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుని తనవైపు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న తాజా నిర్ణయాలను ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవడంలో సీఎం జగన్ తనదైన ముద్ర వేశారు. అటు మహిళా ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకునే పనులను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. 30 లక్షల ఇళ్లు అందించడం ద్వారా ఓటు బ్యాంకును కోల్పోకుండా చూసుకుంటోంది. ఈ నెల 28న అమ్మ ఒడి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. 44 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున నగదును ప్రభుత్వం జమ చేయనుంది. ఇలా ప్రధాన ఓటు బ్యాంక్‌ను సీఎం జగన్‌ కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ ఓటు బ్యాంకే వచ్చే ఎన్నికల్లో గెలుపుకు డిసైడింగ్‌ ఫ్యాక్టర్ కానుంది. 

Tags:    

Similar News