జగన్ పోలింగ్ వ్యూహం.. ప్రతిపక్షాలకు దిమ్మ తిరగాల్సిందే.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటనలో సీఎం జగన్‌ రాష్ట్ర విభజనలో భాగంగా

Update: 2023-07-02 11:40 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటనలో సీఎం జగన్‌ రాష్ట్ర విభజనలో భాగంగా ప్రత్యేకంగా రావాల్సిన అన్ని నిధులు, ప్రత్యేక హోదా, పెండింగ్ అంశాల గురించి కేంద్ర పెద్దలతో చర్చించనున్నారని బహిరంగంగా చెబుతున్న.. వెనుక మాత్రం పెద్ద స్కేచ్‌ ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. సీఎం వైఎస్ జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. మరోసారి విజయం సాధించడానికి ప్లాన్‌ చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తోంది. అయితే అసలు విషయం వేరే ఉందని సమాచారం. ముందస్తైనా, షెడ్యూల్‌ ప్రకారమైనా.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పెద్ద విషయమే కాదని సీఎం జగన్‌ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్‌ కోరుకుంటున్నదల్లా.. ఎన్నికలు ఓకే ఫేజ్‌లో జరగకూడదని. ఒకే ఫేజ్‌లో ఎన్నికలు జరిగితే పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేయడం కష్టమవుతుందని, అదే ఎక్కువ ఫేజ్‌లలో ఎన్నికలు ఉంటే.. అంతా ప్లాన్‌ ప్రకారం చేయొచ్చని జగన్‌ భావిస్తున్నారట.

వీలైతే ఏడు ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సహకారం ఉండేలా చూడాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలను కోరనున్నారని, ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని సమాచారం. గతేడాది గుజరాత్‌లో రెండు ఫేజ్‌లలో, మణిపూర్‌లో రెండు ఫేజ్‌లలో, ఉత్తరప్రదేశ్‌లో ఏడు ఫేజ్‌లలో ఎన్నికలు జరిగాయి. 2021లో వెస్ట్‌ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు 8 ఫేజ్‌లలో నిర్వహించారు. ఎక్కువ ఫేజ్‌లలో ఎన్నికలు నిర్వహించడం వల్ల మళ్లీ విజయం సాధించవచ్చని వైసీపీ అధిష్ఠానం భావిస్తోంది. ఒక్కో ఫేజ్‌పై దృష్టిపెడుతూ ఒకదాని తరువాత ఒకటి జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ చేసి మరోసారి విక్టరీ కొట్టాలని సీఎం జగన్‌ అనుకుంటున్నారట.

175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్‌లో ఏడు ఫేజ్‌లలో పోలింగ్ నిర్వహించాలని కోరుకుంటున్నారట. అయితే జగన్‌ కోరుకుంటున్నట్లు ఏపీలో అన్ని ఫేజ్‌లకు ఈసీఐ అంగీకరించడం కష్టమైనది. ఎందుకంటే.. ఏపీలో రాజకీయాలు మరీ దారుణంగా ఉండవు, హింస కూడా తక్కువే, మరోకటి మావోయిస్టు సమస్యా లేదు. ఈ కారణంగా ఎన్నికల కమిషన్‌ ఎక్కువ ఫేజ్‌లలో ఎన్నికలు నిర్వహించాలనుకోదు. ఒక వేళ ఎక్కువ ఫేజ్‌లలో ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల కమిషన్‌పై విమర్శలు వస్తాయి. వైఎస్‌ జగన్ కోసం ఎన్నికల కమిషన్‌ అలాంటి పరిస్థితిని ఏ మాత్రం తెచ్చుకోదు. కానీ వైఎస్‌ జగన్‌కు కేంద్రంలోని బీజేపీ నుంచి ఏ మాత్రం సహకారం ఉన్నా.. ఏడు ఫేజుల్లో కాకపోయినా.. మూడు ఫేజ్‌లకు అయినా అంగీకరించే అవకాశం ఉంది.   

Tags:    

Similar News