డీకేతో షర్మిల మ‌ళ్లీ భేటీ..!

వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉందని, ఇందుకు సంబంధించిన మంతనాలు డీకే శివకుమార్‌..

Update: 2023-05-29 08:21 GMT

Sharmila met DK Shivakumar

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటి అయ్యారు. బెంగళూరులోని శివకుమార్‌ నివాసంలో జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతోంది. ఇంతకుముందు కూడా డీకే శివ‌కుమార్‌తో షర్మిల సమావేశమయ్యారు. అప్పుడే రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఘన విజయాన్ని అందించి, డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన డీకేకు అభినందలు తెలిపేందుకు వెళ్లారా? లేక మరేదైనా కారణం ఉన్నదా అన్నది అంతుపట్టడం లేదు.

వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉందని, ఇందుకు సంబంధించిన మంతనాలు డీకే శివకుమార్‌ నివాసంలో జరుగుతున్నాయని ఊహాగానాలు విన‌ప‌డుతున్నాయి. ఒకవేళ విలీనానికి షర్మిల అంగీకరించపోతే.. కనీసం పొత్తుకైనా ఒప్పించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందట.! త‌ద్వారా తెలంగాణలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానుల ఓట్లను సంపాదించడంతో పాటుగా.. రెడ్డి, క్రిస్టియన్‌ సామాజికవర్గాల ఓట్ల బ్యాంకును తమవైపుకు తిప్పుకోవచ్చన్నది కాంగ్రెస్‌ భావనగా తెలుస్తోంది.
తెలంగాణలో పాదయాత్రతో బీఆర్ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను షర్మిల బాగానే ఎండగట్టారు. ఈ క్ర‌మంలో షర్మిలను పార్టీలో చేర్చుకుంటే తెలంగాణలో కొంత మేర కలసి వస్తుందని కాంగ్రెస్‌ అనుకుంటోంది. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెట్టింది. షర్మిలతో కాంగ్రెస్‌ పార్టీ కీలక నాయకురాలు ప్రియాంకగాంధీ కూడా మంతనాలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరి భేటీలో డీకే శివకుమార్‌ కీలక పాత్ర పోషించార‌నే వాద‌న కూడా ఉంది.


Tags:    

Similar News