ఏపీవాసులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ
సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది
సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని డిపోల నుంచి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుందని అధికారులు తెలిపారు. సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు సొంత గ్రామాలకు తరలి వస్తారని భావించి ఆర్టీసీ అధికారులు స్పెషల్ సర్వీసులను సిద్ధం చేశారు.
ఆ నాలుగు రోజులు...
జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని, అన్నీ బస్సులకు రెగ్యులర్ ఛార్జీలే వసూలు చేస్తారని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతికి 2,400ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.